BIG BREAKING: పాకిస్తాన్ ఆర్మీ వాహనంపై దాడి.. అధికారితో పాటు ఆరుగురు సైనికులు దుర్మరణం!
బలూచిస్తాన్‌లోని బోలాన్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఈ పేలుడులో ఒక అధికారి సహా ఆరుగురు సైనికులు మృతి చెందారు. మరో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. ఆర్మీ వాహనం సాధారణ గస్తీలో ఉన్నప్పుడు ఈ దాడి జరిగింది.