Alla Nani: టీడీపీ గూటికి ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి..!
వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలుగు దేశం పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఆళ్ల నాని వైసీపీ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలుగు దేశం పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఆళ్ల నాని వైసీపీ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఏపీలో నామినేటెడ్ పదవుల రెండో జాబితాను చంద్రబాబు సర్కార్ విడుదల చేసింది. మొత్తం 59 మందితో జాబితాను విడుదల చేసింది. రెండో జాబితా కార్పొరేషన్ పదవుల్లో టీడీపీ నుంచి 46 మంది, జనసేన నుంచి 10 మంది, బీజేపీ నుంచి ముగ్గురికి పదవులు దక్కాయి.
టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసులో ఏ-1 పానుగంటి చైతన్యను సీఐడి కస్టడీలోకి తీసుకుంది. చైతన్యను విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలని సీఐడి కోరగా.. కోర్టు మూడు రోజులకు అనుమతించింది. ఈ మేరకు న్యాయవాదులకు కనిపించేలా విచారణ జరపాలని కోర్టు సూచన చేసింది.
టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ | AP CM Chandrababu Naidu Conducts Meeting with Cabinet and Party Leaders to discuss mainly on 8 points like Panchayats, Party Membership etc | RTV
రాష్ట్ర కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు మంత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఉచిత ఇసుక విషయంలో సీరియస్ అయినట్లు సమాచారం. అలాగే వైన్ షాపుల విషయంలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తగా మంత్రులపై సీరియస్ అయ్యారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహనరావును టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. కంచికచర్లలోని పునరావాస కేంద్రాన్ని ఆయన పరిశీలించడానికి వెళ్లారు. 4 రోజులుగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రాని మీరు ఇప్పుడెందుకు వచ్చారని టీడీపీ శ్రేణులు నిలదీయడంతో ఘర్షణ జరిగింది.
మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదల అయ్యారు. ఈవీఎం ధ్వంసంతో సహా మూడు కేసుల్లో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను ఏపీ హైకోర్టు మంజూరు చేయడంతో ఈరోజు ఆయన నెల్లూరు జైలు నుంచి బయటకు వచ్చారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ముగ్గురు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ఎంపీ కేశినేని చిన్ని సమక్షంలో కార్పొరేటర్లు మైలవరపు మాధురి లావణ్య, మైలవరపు రత్నకుమారి, హర్షద్ టీడీపీ కండువా కప్పుకున్నారు.
వెలిగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వం దిగజారుడు వ్యాఖ్యలు చేస్తోందని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టును ఎవరు పూర్తి చేశారనేది ప్రజలందరికీ తెలుసన్నారు. ఈవీఎంలపై అనుమానం ఉండడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించామన్నారు. న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు.