Alla Nani: టీడీపీ గూటికి ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి..!

వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలుగు దేశం పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఆళ్ల నాని వైసీపీ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

New Update
alla

వైసీపీ  మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని (కాళీకృష్ణ శ్రీనివాస్‌) నేడు టీడీపీలో చేరనున్నారు. ఈరోజు సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశం అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో నాని టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సోమవారం సాయంత్రం జిల్లా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నేతలకు అధిష్ఠానం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తుంది. 

Also Read: లఖ్‌నవూతో పంత్ 12 ఏళ్ల అగ్రిమెంట్.. సంజీవ్ గొయెంకా కామెంట్స్ వైరల్

కొంతకాలంగా ఆళ్ల నాని టీడీపీ నేతలతో చర్చలు జరపగా.. గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఆయనకు ఎలాంటి హామీ ఇవ్వకపోయినా.. పార్టీలో స్వచ్ఛందంగా చేరేందుకే నాని ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.గత ఎన్నికల్లో ఆళ్ల నాని ఏలూరు అసెంబ్లీ స్థానానికి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడారు. ఆ తర్వాత వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు.

Also Read: Actress: బీచ్‌లో యోగా చేస్తుండగా..హీరోయిన్‌ ని లాక్కెళ్లిన రక్కసి అల!

Alla Nani Join In TDP

ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ఇంతకు ముందు ప్రకటించారు. ఆ తర్వాత ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం నడిచింది. చివరకు టీడీపీలో చేరబోతున్నట్లు సమాచారం. ఆళ్ల నానికి అత్యంత సన్నిహితుడు, విజయనగరానికి చెందిన ఓ నేత టీడీపీ నేత అధిష్టానంతో చర్చించినట్లు తెలుస్తుంది. ఆళ్ల నాని మూడు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు.

Also Read: Pushpa-2: మీరంటే ముద్దు.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్

ఆళ్ల నాని 2004, 2009 ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయాన్నిఅందుకున్నారు. ఆళ్ల నాని కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. వైసీపీ ఆవిర్భావ సమయంలో పార్టీలో చేరారు.  2014 ఎన్నికల్లో ఏలూరు నుంచి వైసీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు.. ఆ తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. 2019 ఎన్నికల్లో ఆళ్ల నాని ఏలూరు నుంచి వైసీపీ తరఫున పోటీచేసి విజయం అందుకున్నారు ఆ తర్వాత జగన్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా రెండున్నరేళ్ల పాటూ విధులు నిర్వహించారు.

Also Read: AP:  వామ్మో అంత ధరలా..ఏపీలో పుష్ప–2 టికెట్ ధరలు భారీగా పెంపు

ఆ తర్వాత ఎమ్మెల్యేగా కొనసాగారు. 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఏలూరు నుంచి పోటీచేసి ఓటమి చవిచూశారు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు.. ఇప్పుడు టీడీపీలో చేరబోతున్నారు. అయితే నాని అధికారికంగా టీడీపీలో చేరబోతున్నట్లు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే ఆళ్ల నాని బాటలోనే మరికొందరు వైసీపీ నేతలు కూడా రానున్నట్లు సమాచారం. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరబోతున్నట్లు సమాచారం. ఓ మాజీ మంత్రి, మరో మాజీ ఎమ్మెల్యే కూడా వైసీపీని వీడుతున్నట్లు సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు