Rain Alert : ఏపీకి తప్పిన తుపాను ముప్పు..ఈరోజు, రేపు భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రతికూల పరిస్థితులతో తుపానుగా మారలేదు.శుక్రవారం ఉదయం వరకు తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.శుక్ర, శనివారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.