YSRCP: జగన్ కు మరో బిగ్ షాక్.. వైసీపీకి కీలక నేత రాజీనామా!
వైసీపీ అధినేత జగన్ కు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య బిగ్ షాక్ ఇచ్చారు. వైసీపీకి ఆయన రాజీనామా చేశారు. పార్టీతో పాటు గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు జగన్ కు ఆయన లేఖ రాశారు. దీంతో రోశయ్య ఏ పార్టీలో చేరుతారనే అంశంపై చర్చ సాగుతోంది.