Botsa Satyanarayana: మాజీ మంత్రి బొత్సకు బిగ్ షాక్

AP: వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు ఊహించని బిగ్ షాక్ తగిలింది. తన సోదరుడు లక్ష్మణరావు జనసేనలో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన ముఖ్యనేతలతో చర్చలు జరిపిన లక్ష్మణరావు దసరా తరువాత చేరుతారనే చర్చ జోరందుకుంది.

New Update
botsa satya

MLC Botsa Satyanarayana: తన సొంత నియోజకవర్గమైన విజయనగరంలో వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు ఊహించని షాక్ తగిలింది. తన సోదరుడు లక్ష్మణరావు త్వరలో జనసేనలో చేరేందుకు సిద్దమైనట్లు విజయనగర రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇందుకోసం లక్ష్మణరావు ఇప్పటికే జనసేన ముఖ్యనేతలతో చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా దసరా ముందు రోజు లేదా తరువాత ఆయన జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

రాజకీయాల్లోకి నో ఎంట్రీ...

తన రాజకీయ భవిష్యత్ కోసమే లక్ష్మణరావు జనసేనలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వ్యాపార రంగంలో ఉన్న గత పదేళ్ళ నుంచి తన అన్న బొత్స సత్యనారాయణ వలె రాజకీయాల్లో రావాలని విశ్వా ప్రయత్నాలు చేయగా.. వైసీపీకి మాత్రం అతనికి అవకాశం ఇవ్వలేదు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బడ్డుకొండ అప్పలనాయుడుకు వ్యతిరేకంగా  అతను పని చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతని ఓటమిలో ఈయన భాగస్వామ్యం ఉన్నట్లు చర్చ నడించింది. తనకు అనుచరులుగా ఉన్న ఏడుగురు సర్పంచులను జనసేనలోకి పంపి, తద్వారా కూటమి విజయానికి పరోక్షంగా కృషి చేశారనే టాక్ కూడా ఉంది.

పవన్ సమక్షంలో...

కూటమి విజయం కోసం పని చేసిన బొత్స లక్ష్మణరావు ముందుగా టీడీపీలో చేరాలని అనుకున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు సైలెంట్ గా ఉన్న ఆయన.. ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూడడంతో పార్టీ మార్పు పై టీడీపీ, జనసేన పార్టీ నేతలతో చర్చలు జరిపినట్లు ప్రచారం నడిచింది. కాగా ఆయన జనసేనలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తన సోదరుడు లక్ష్మణరావు జనసేన చేరిక బొత్స సత్యనారాయణకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుందని.. వైసీపీకి.. బొత్సకు ఇది రాజకీయంగా పెద్ద దెబ్బ అనే గుసగుసలు విజయనగరంలో వినిపిస్తున్నాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు