Nara Lokesh: విశాఖపట్నం జిల్లా భీమిలిలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాన్ని మంత్రి నారా లోకేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. 10వ తరగతి క్లాస్ రూమ్ ను సందర్శించి అక్కడ పాఠ్యాంశాల బోధన, సౌకర్యాలపై విద్యార్థినులను ఆరా తీశారు. వెలుపల చెప్పులు వదిలి మంత్రి క్లాస్ రూమ్స్ ను సందర్శించారు. వెనుకబడిన విద్యార్థుల కోసం పాఠశాలలో ఏర్పాటుచేసిన రెమిడియల్ క్లాస్ రూమ్ ను మంత్రి సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ను పరిశీలించారు. లోకల్ ఫర్ వోకల్ పేరుతో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ ను మంత్రి లోకేష్ సందర్శించారు. స్థానిక ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేయడమే తమ లక్ష్యమని విద్యార్థినులు తెలిపారు. కెజిబివిలో బోధనా పద్ధతులు, సౌకర్యాలను ప్రిన్సిపాల్ కుమారి గంగ మంత్రికి వివరించారు.
పూర్తిగా చదవండి..Nara Lokesh: విద్యాకమిటీలు ఏర్పాటు చేసింది పెత్తనం చేయడానికి కాదు.. అధికారులకు మంత్రి లోకేష్ హెచ్చరిక..!
విద్యాకమిటీలు ఏర్పాటు చేసింది పెత్తనం చేయడానికి కాదని మంత్రి లోకేష్ అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యత పెంచాలన్నారు. ప్రత్యేకమైన యాప్ ద్వారా విద్యాకమిటీల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటామన్నారు. పెండింగ్ లో ఉన్న ఆయాల జీతాలు, కెమికల్ బిల్స్ చెల్లిస్తామని చెప్పారు.
Translate this News: