ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!
జనసేన పార్టీ పెట్టే సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా నిలబడ్డాం అని పేర్కొన్నారు. జనసేనలో చేరేందుకు చాలా మంది వస్తున్నారని తెలిపారు.
జనసేన పార్టీ పెట్టే సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా నిలబడ్డాం అని పేర్కొన్నారు. జనసేనలో చేరేందుకు చాలా మంది వస్తున్నారని తెలిపారు.
నాగార్జున సాగర్ డ్యామ్ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. డ్యామ్ పైకి ఏపీ పోలీసులు దౌర్జన్యంగా తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వచ్చారని మండిపడ్డారు. దురాలోచనతోనే ఏపీ ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిందంటూ ఆరోపణలు చేశారు.
కృష్ణా బోర్డు వైఫల్యంతోనే సాగర్ డ్యామ్ వివాదం తలెత్తిందని ఏపీ జలవనరుల ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్ కృష్ణాబోర్డు ఛైర్మన్ శివనందన్ కమార్‌కు లేఖ రాశారు. అయితే ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఈరోజు రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం కానున్నారు.
నాగార్జునసాగర్ డ్యామ్ పర్యవేక్షణ బాధ్యతలను కృష్ణా బోర్డుకు, కేంద్ర బలగాలకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తెలంగాణ, ఏపీ అంగీకరించాయి. శనివారం ఉదయం 11 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి రెండు తెలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశం కానున్నారు.
నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ (KRMB) లేఖ రాసింది. కుడి కాలువకు నీటి విడుదల వెంటనే ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. సాగునీరు కావాలని ఏపీ తమను కోరలేదని లేఖలో పేర్కొంది. ఉద్రిక్తతలకు తెరదించాలని కేఆర్ఎంబీ కోరింది.
ఏపీలో సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేదని అన్నారు టీడీపీ నేత దేవినేని ఉమా. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వైసీపీ నేతలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ ఇసుక తవ్వకాల ద్వారా వచ్చిన రూ.వేల కోట్లు తాడేపల్లి ఖజానాకు వెళ్లాయని ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో లేని ఓట్లను వైసీపీ యాడ్ చేస్తుందని.. దానికి అధికారులు హెల్ప్ చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ పతనం ఖాయమని అన్నారు.
లోకేష్ రాజకీయాలకు పనికిరాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. లోకేష్ ను సీఎం చేసేందుకు చంద్రబాబు, పవన్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పురంధేశ్వరి టీడీపీకి కోవర్టు లాగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు.