లోకేష్ రాజకీయాలకు పనికిరాడు.. అంబటి సంచలన వ్యాఖ్యలు లోకేష్ రాజకీయాలకు పనికిరాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. లోకేష్ ను సీఎం చేసేందుకు చంద్రబాబు, పవన్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పురంధేశ్వరి టీడీపీకి కోవర్టు లాగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. By V.J Reddy 29 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Ambati Rambabu: టీడీపీ నేత లోకేష్ (Lokesh) పై తీవ్ర విమర్శలు చేశారు జన వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu). అనపర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రపై సెటైర్లు వేశారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ.. లోకేష్ రాజకీయాలకు పనికిరాని వ్యక్తి అని అన్నారు. లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయడానికి చంద్రబాబు (ChandraBabu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తాపత్రయం పడుతున్నారని పేర్కొన్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర ఒక కామెడీ షో అని అన్నారు. లోకేష్ గురించి మా స్థాయి నాయకులు మాట్లాడటం సిగ్గుపడాలి అంటూ ఎద్దేవా చేశారు. ALSO READ: BREAKING: ఏపీలో ముందస్తు ఎన్నికలపై సజ్జల క్లారిటీ! లోకేష్ కు బుర్రలో ఏముందో నోటితో చెప్పలేని పరిస్థితి అని పేర్కొన్నారు. లోకేష్ పాదయాత్ర తోటే తెలుగుదేశం సర్వనాశనం అవుతుందని అంబటి విమర్శించారు. పోలవరంపై రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు అంబటి.. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమవుతుందో నేను చెప్పలేను నేను జ్యోతిష్యుని కాను అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించిన రోజు కూడా మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా పాదయాత్రపై సెటైర్లు వేశారు. ఆయన ట్విట్టర్ లో.. "ప్రారంభమయిన "హాస్యగళం" విని, చూసి........నవ్వుకోండి!" అంటూ లోకేష్ ను ట్యాగ్ చేసి పోస్ట్ చేశారు. ప్రారంభమయిన "హాస్యగళం" విని, చూసి........నవ్వుకోండి ! @naralokesh — Ambati Rambabu (@AmbatiRambabu) November 27, 2023 అలాగే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిపై (Purandeswari) చురకలు అంటించారు. పురంధేశ్వరి బీజేపీ (BJP) అధ్యక్షురాలు కానీ.. తెలుగుదేశం కోవర్ట్టు అంటూ వ్యాఖ్యానించారు. ఆమెకు బీజేపీ సర్వనాశనం అయినా పర్వాలేదు తెలుగుదేశం బాగుండాలి అన్నట్లు వ్యవహరిస్తున్నట్లు మండిపడ్డారు. ALSO READ: చంద్రబాబు, పవన్ కలవకూడదని జగన్ కుట్ర చేశాడు.. లోకేష్ ఫైర్! #lokesh #ambati-rambabu #telugu-latest-news #ap-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి