వైసీపీ పతనం ఖాయం.. అచ్చెన్నాయుడు ఫైర్! వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో లేని ఓట్లను వైసీపీ యాడ్ చేస్తుందని.. దానికి అధికారులు హెల్ప్ చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ పతనం ఖాయమని అన్నారు. By V.J Reddy 29 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Atchannaidu Fires On YCP: జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు టీడీపీ (TDP) రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్టంలో వైసీపీఏ (YCP) దొంగ అని అన్నారు. టీడీపీ ఓట్లు తీసేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని మేము కలుస్తామని తెలిసి వైసీపీ వాళ్ళు ముందే కలిశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ పతనం ఖాయమని అన్నారు. లేని ఓట్లను వైసీపీ యాడ్ చేస్తుంది దానికి అధికారులు హెల్ప్ చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే అన్ని ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. ALSO READ: BREAKING: ఏపీలో ముందస్తు ఎన్నికలపై సజ్జల క్లారిటీ! 11లక్షల ఓట్లు ఫామ్ 6 ద్వారా గతంలోనే విచారణ చేయాలనీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామని అన్నారు. రాప్తాడులో కూడా దొంగ ఓట్లు చాలా ఉన్నాయని పేర్కొన్నారు. ఊరువకొండ 10 వేల ఓట్లు ఫామ్ 7 కూడా లేకుండా తీసేస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రగిరి లో 20 వేల ఓట్లు కొత్తవి చేర్చారు..దాని మీద ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త పోలింగ్ స్టేషన్ పెట్టాలి అంటే అన్ని పార్టీలని అడగాలి కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అడిగిన వెంటనే కొత్తవి పెడుతున్నారని మండిపడ్డారు. 17 నియోజకవర్గలలో టీడీపీ ఓట్లు తొలిగించారని ధ్వజమెత్తారు. ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ కు ఇచ్చామని అన్నారు. నోటిస్ ఇవ్వకుండా తప్పలు జరిగితే BLO కి నోటిస్ ఇస్తామని హామీ ఇచ్చారు. 8 జిల్లాల కలెక్టర్స్ వైసీపీ కోసం పనిచేస్తున్నారు..మీరు చేసిన తప్పులకి బాధ్యత వహించాలని హెచ్చరించారు. అడ్డగోలుగా పోలింగ్ స్టేషన్స్ మారుస్తున్నారని ధ్వజమెత్తారు. ALSO READ: చంద్రబాబు, పవన్ కలవకూడదని జగన్ కుట్ర చేశాడు.. లోకేష్ ఫైర్! #ap-breaking-news #telugu-latest-news #ap-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి