/rtv/media/media_files/lg6gtvkJMc8vlaYqZX0S.jpg)
Lulu Mall To Andhra Pradesh: ఏపీవాసులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రముఖ సంస్థ లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మరోసారి ముందుకు వచ్చిందని వివరించారు. ఈ క్రమంలోనే శనివారం సీఎం చంద్రబాబు నాయుడితో లులూ గ్రూప్ ప్రతినిధులు భేటీ అయ్యారు. లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ యూసఫ్ అలీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అష్రఫ్ అలీ.. చంద్రబాబును కలిశారు.
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాల గురించి చర్చించారు. ఈ విషయం గురించి సీఎం స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. లులూ గ్రూప్ ప్రతినిధులకు ఏపీ తిరిగి స్వాగతం పలుకుతోందని ట్వీట్ చేశారు. మరోవైపు అమరావతిలో లులూ గ్రూప్ ఛైర్మన్ యూసుఫ్ అలీతో జరిగిన భేటీలో ఏపీలో పెట్టుబడులపై చర్చించినట్లు చంద్రబాబు వివరించారు. విశాఖపట్నంలో లులూ గ్రూప్ షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్ నిర్మాణం గురించి చర్చించినట్లు తెలుస్తుంది.
I'm pleased to welcome the Chairman & MD of Lulu Group International, Mr @Yusuffali_MA, and the Executive Director, Mr Ashraf Ali MA, back to Andhra Pradesh. I had a very productive meeting with their delegation in Amaravati today. We discussed plans for a Mall and multiplex in… pic.twitter.com/itk1RuUIHX
— N Chandrababu Naidu (@ncbn) September 28, 2024
అలాగే విజయవాడలో లులూ హైపర్ మార్కెట్, తిరుపతిలో లులూ మల్టీప్లెక్స్ నిర్మాణం గురించి ఈ భేటీలో చర్చించామని.. ఈ చర్చలు సానుకూలంగా జరిగాయని చంద్రబాబు తెలిపారు. వీటితో పాటుగా ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్‌లో రాష్ట్రవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వారికి వివరించినట్లు బాబు తెలిపారు. ప్రభుత్వం నుంచి అన్నిరకాలుగా ప్రోత్సాహం, మద్దతు అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఏపీ అభివృద్ధిలో వారు కలిసివస్తారని భావిస్తున్నానని చంద్రబాబు ట్వీట్ లో పేర్కొన్నారు.
మరోవైపు గత టీడీపీ ప్రభుత్వం హయాంలో విశాఖపట్నంలో మాల్, కన్వెన్షన్ సెంటర్ నిర్మించేందుకు లులూ గ్రూప్.. ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సుమారుగా రూ.2,200 కోట్ల పెట్టుబడులతో ఏడు వేల మందికి ఉపాధి కల్పించేలా ఈ ఒప్పందం జరిగిందని తెలుస్తుంది. సీఎం చంద్రబాబు సైతం దీనికి శంకుస్థాపన చేశారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే అప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. లులూ గ్రూప్‌కు విశాఖలో ఇచ్చిన భూమికి అద్దె తక్కువగా ఉందని ఒప్పందం రద్దు చేసింది.
అంతేకాకుండా భూమిని సైతం వెనక్కి తీసుకుంది. దీంతో ఏపీలో ఇప్పట్లో పెట్టుబడులు పెట్టమంటూ లులూ గ్రూప్ వెనక్కి వెళ్లిపోయింది. అయితే తాజాగా మరోసారి ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో.. లులూ గ్రూప్ మరోసారి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిం ది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబుతో లులూ గ్రూప్ ఛైర్మన్ భేటీ అయినట్లు తెలుస్తుంది.
Also Read: పండుగ వేళ ఆర్టీసీఅదిరిపోయే శుభవార్త..!