AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. రానున్న మూడు గంటల్లో పిడుగుల వర్షం
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అయింది. ఇదిలా ఉండగా రానున్న మూడు గంటల్లో ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.