/rtv/media/media_files/CgURTrx3myiJBKZumSmH.jpg)
ap rains
AP Rain Alert : ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అయింది. ఇదిలా ఉండగా రానున్న మూడు గంటల్లో ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. విజయనగరం, విశాఖ, అల్లూరి, కోనసీమ, గుంటూరు, పల్నాడు. అనకాపల్లి జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ చెట్ల కింద ఉండొద్దని వారు సూచించారు.
Also Read : ప్రేమ పేరుతో కానిస్టేబుల్ మోసం..అనుమానస్పదంగా యువతి మృతి
మరోవైపు, కాకినాడ, ఏలూరు, బాపట్ల, ప్రకాశం,తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. ఈదురు గాలులు సైతం వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
రాష్ర్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మోస్తరు వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు చెప్పారు. పిడుగుపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎవరు చెట్ల కింద ఉండరాదని అధికారులు సూచించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. దూర ప్రయాణాలు రద్దు చేసుకుని, ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని వివరంచారు. ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఎండీ ప్రఖర్ జైన్ కోరారు.
అక్కడక్కడ పిడుగులు పడవచ్చని 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మత్య్సకారులు వేటకు వెళ్లరాదని తెలిపారు. ఇప్పటికే భారీ వర్షాలతో ఏపీలోని పలు జిల్లాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. తిరుపతిలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: విజయవాడలో సైకో.. దసరా ముందు మటన్ కత్తితో పిన్నిని ముక్కలు ముక్కలుగా