Dokka Manikya Vara Prasad: టీడీపీలో చేరిన వైసీపీ మాజీ మంత్రి
ఏపీలో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు.
ఏపీలో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు.
AP: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. సీఎం జగన్‌పై అనుచిత, నిరాధార వ్యాఖ్యలు చేశారని ఆయనపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. కాగా, ఆయనపై చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్‌కి ఈసీ ఆదేశాలు ఇచ్చింది.
ఏపీ రాజకీయాల్లో జగన్‌ను తిట్టే వాళ్లు ఉంటారు.. మెచ్చుకునే వాళ్లూ ఉంటారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కొడుకుగానే రాజకీయాల్లోకి దూసుకొచ్చినా తనకంటూ సపరేటు బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు జగన్. ఆయన గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్లండి..
సీఎం జగన్ తోపాటు తన కంటి గాయంపై జరుగుతున్న ట్రోలింగ్స్ కు స్పందించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. తమపై జరిగిన దాడిని మానవత్వం లేకుండా ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిని చంపాలని చూసిన వారిని పోలీస్ డిపార్ట్మెంట్ కఠినంగా శిక్షిస్తుందన్నారు.
AP: సీఎం జగన్‌పై ట్విట్టర్(X) వేదికగా విమర్శలు గుప్పించారు చంద్రబాబు. తోడబుట్టిన చెల్లెలి పుట్టుక పైనా... మహాలక్ష్మీగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రా? అని అన్నారు. ఇది కాదా వికృత మనస్తత్వం? అంటూ విమర్శించారు.
గుంటూరులో మహిళ కిడ్నాప్ వివాదం ముగిసింది. టీడీపీ నాయకులు బలవంతంగా విడుదల రజినీ పేరుతో నామినేషన్ వేయించేందుకు ఆమెను ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు స్త్రీని గుర్తించి పోలీసులు ఇంటికి పంపించారు. స్వచ్ఛందంగానే నామినేషన్ వేసినట్లు బాధితురాలు తెలిపింది.
AP: మేమంతా సిద్ధం బస్సు యాత్రను ముగించుకున్న సీఎం జగన్.. రేపు పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11:25 నుంచి 11:40 మధ్య నామినేషన్ దాఖలు వేయన్నారు. ఇప్పటికే జగన్ తరఫున ఒక సెట్ నామినేషన్ వేశారు ఎంపీ అవినాష్ రెడ్డి.
AP: పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు పవన్. తన ఐదేళ్ల సంపాదన 114.76 కోట్లుగా ఉందని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. తనకు అప్పులు రూ.64.26 కోట్లు ఉన్నట్లు తెలిపారు. తన దగ్గర 3.15 లక్షలు మాత్రమే ఉన్నట్లు వెల్లడించారు.