Crime News : ఆర్టీసీ బస్సు-ఆటో ఢీకొని ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు..!
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక బస్‌స్టాప్ వద్ద ఆర్టీసీ బస్సు - ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.