/rtv/media/media_files/2025/01/29/u3xH7zR7SXZSfsboArOy.webp)
Alluri District Road Accident
Road Accident: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎటపాక మండలం భీమవరం వద్ద శనివారం అర్ధరాత్రి బైక్‌ను లారీ ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులు ఎటపాక మండలం కాన్నాపురంకి చెందిన పోడియం రాజారావు. కురసం భద్రయ్యలుగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: సౌకర్యవంతమైన నిద్ర కోసం 7 సాధారణ చిట్కాలు