AP: స్కూల్ బస్సు బోల్తా..విద్యార్థిని మృతి!
అన్నమయ్య జిల్లా ఓబులవారి పాలెం వద్ద బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో భవిష్య అనే ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలను కోల్పోయింది. బస్సు రోడ్డు పై ఉన్న రాయిని ఎక్కడంతో బోల్తా పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బస్ కండీషన్ లో లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.