కోహ్లీ రనౌట్ ఆత్మహత్యనే.. ఇక భారత్ భరించదు: అనిల్ కుంబ్లే ఫైర్
న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో విరాట్ రనౌట్ పై అనిల్ కుంబ్లే తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. కోహ్లీ రనౌట్‌ను ఆత్మహత్యగా పేర్కొంటూ ఇది తనను ఆందోళన కలిగించిందన్నాడు. దీనిని భారత్ ఎక్కువ కాలం భరించదని, భారత టీమ్ గందరగోళంలో ఉందంటూ ఫైర్ అయ్యాడు.