కోహ్లీ రనౌట్‌ ఆత్మహత్యనే.. ఇక భారత్ భరించదు: అనిల్ కుంబ్లే ఫైర్

న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో విరాట్ రనౌట్ పై అనిల్ కుంబ్లే తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. కోహ్లీ రనౌట్‌ను ఆత్మహత్యగా పేర్కొంటూ ఇది తనను ఆందోళన కలిగించిందన్నాడు. దీనిని భారత్ ఎక్కువ కాలం భరించదని, భారత టీమ్ గందరగోళంలో ఉందంటూ ఫైర్ అయ్యాడు. 

author-image
By srinivas
New Update
DFDFDFE

Ind vs Nz: న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో విరాట్ రనౌట్ పై మాజీ భారత క్రికెటర్ అనిల్ కుంబ్లే తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. కోహ్లీ రనౌట్‌ను అనిల్ కుంబ్లే ఆత్మహత్యగా పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌట్ చేసి బ్యాటింగ్ కు దిగిన భారత్ కొద్దిసేపు నియంత్రణలో ఉన్నట్లు అనిపించిన కొద్ది క్షణాల్లోనే పూర్తిగా గందరగోళం నెలకొందంటూ ఫైర్ అయ్యాడు. 

అనవసరమైన రన్ కోసం ప్రయత్నించి..

ఈ మేరకు ముంబై వాంఖడే వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో 86 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ 18, యశస్వీ జైస్వాల్ 30, సిరాజ్ 0, కోహ్లీ 4 పరుగులకే ఔట్ అయ్యారు. అయితే రోహిత్ ఔట్ తర్వాత కొద్దిసేపు గిల్, జైస్వాల్ నెమ్మదిగా స్కోర్ బోర్డ్ పరిగెత్తించగా వికెట్ కోల్పోకుండా జాగ్రత్తపడ్డారు. అయితే ఉన్నట్టుండి పది నిమిషాల్లోనే వరుస వికెట్లు కోల్పోయింది భారత్. విరాట్ ఫోర్ కొట్టిన తర్వాత సింగిల్ కు ప్రయత్నించి రనౌట్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అనవసరమైన రన్ కోసం ప్రయత్నించి కావాలనే రనౌట్ అయ్యాడమే అనే అనుమానం కలుగుతోందంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో త్వరలో ప్రపంచంలోనే ఎత్తయిన గాంధీ విగ్రహం.. ప్లానింగ్ ఇదే

ఇలా పదేపదే జరగకూడదు.. 

అయితే విరాట్ రనౌట్ పై రియాక్ట్ అయిన అనిల్ కుంబ్లే.. ‘మీకు ప్రతి గేమ్‌లో ఇలా పదేపదే జరగకూడదని కోరుకుంటాం. కానీ ప్రస్తుతానికి ఇది ఆందోళన కంటే ఎక్కువ ఇంబ్బందిగా ఉంది. రోహిత్ శర్మ వికెట్‌తో మీరు నెమ్మదిగా ఆడాల్సింది. కానీ అలా జరగలేదు. జైస్వాల్ అవుట్, నైట్ వాచ్‌మెన్ సిరాజ్ మొదటి బంతికి అవుట్ కావడం దారుణం. తర్వాత  వచ్చిన కోహ్లీ రన్ అవుట్ మరీ దారుణం. ఇది ఆత్మహత్యగానే అనిపిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కుంబ్లే.

ఇది కూడా చదవండి: మేమంతా ఒకే పిడికిలి.. రిటెన్షన్‌ పై హార్దిక్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Advertisment
తాజా కథనాలు