ఓపికగా ఆడలేరా.. గంభీర్ టీమ్‌పై మాజీలు ఫైర్.. పూజారా కావాలంటూ!

స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్ పేలవమైన ఆటపై మాజీలు మండిపడుతున్నారు. ఒక రోజులో 400 పరుగులు చేయగల జట్టుగా తీర్చిదిద్దాలనే గంభీర్ ఆలోచన మంచిది కాదంటున్నారు. పూజారాలాంటి ఆటగాడు ఉండాలని చెబుతున్నారు. 

New Update
sawrewserw

Anil kumble: స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్ పేలవమైన ఆటపై మాజీలు మండిపడుతున్నారు. 46 పరుగులకే ఆలౌట్ కావడంతోపాటు 5గురు బ్యాటర్లు డకౌట్ కావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టులో ఆటతీరు లోపించిందని, ఎప్పుడూ అటాక్ చేద్దామనే ప్రయత్నం మంచిది కాదంటూ చురకలంటిస్తున్నారు. 

అతడు లేనిలోటు స్పష్టంగా కనిపించింది..

ఈ మేరకు భారత మాజీ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే మాట్లాడుతూ.. విరాట్, రోహిత్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు.  ‘విరాట్‌ మూడో స్థానంలో ఎందుకు వచ్చాడో నాకు అర్థం కాలేదు. అతడు నాలుగో స్థానంలోనే బరిలోకి దిగాలి. అతడే టాప్‌ బ్యాటర్‌. 3వ స్థానం కోసం ఛతేశ్వర్‌ పుజారా లాంటి ఆటగాడే ఉండాలి.  కొన్నేళ్లపాటు నెంబర్‌-3గా అతడు జట్టుకు సేవలు అందించాడు. పుజారా జట్టులో ఉంటే వికెట్‌ పోగొట్టుకొనేవాడు కాదు. బంతి మీదకు వచ్చే వరకు ఆగి ఓపికగా ఆడేవాడు. జట్టులో అతడు లేనిలోటు స్పష్టంగా కనిపించింది' అంటూ తన అభిప్రాయం వెల్లడించాడు.

ఇక పలువురు మాజీలు సైతం గంభీర్ ప్లాన్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది బంగ్లా టీమ్ కాదని, ఏ జట్టుతో ఆడుతున్నామో గమనించాలని సూచిస్తున్నారు. ఒక రోజులో 400 పరుగులు చేయగల జట్టుగా తీర్చిదిద్దాలనే గంభీర్ ఆలోచనం మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు