Ashwin: మరో రికార్డుకు చేరువలో అశ్విన్.. ఏకైక బౌలర్ గా!

భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఒకే ఇన్నింగ్స్ లో మరో 5 వికెట్లు తీస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికసార్లు (38) 5 వికెట్లు పడగొట్టిన తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు.  

author-image
By srinivas
New Update
IND vs ENG: టీమిండియాకు భారీ షాక్‌.. సడన్‌గా టీమ్‌ని వీడిన అశ్విన్‌.. ఎందుకంటే?

Ashwin: భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. న్యూజీలాండ్ తో శుక్రవారం మొదలుకానున్న మూడో టెస్టులో అశ్విన్ మరో 5 వికెట్లు తీస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికసార్లు 5 వికెట్లు పడగొట్టిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటికే 37 సార్లు 5 వికెట్లు పడగొట్టి అనిల్ కుంబ్లే రికార్డు సమం చేసిన అశ్విన్.. మరొక్కసారి 5 వికెట్ల ఫీట్ సాధిస్తే 38 సార్లు ఈ ఘనత అందుకోనున్నాడు. 

ఎనిమిదిసార్లు 10 వికెట్లు..

ఇక అనిల్ కుంబ్లే 35 సార్లు, వన్డేల్లో రెండుసార్లు ఐదేసి వికెట్లు పడగొట్టగా.. టెస్టులో అంతర్జాతీయ క్రికెట్‌లో ఎనిమిదిసార్లు 10 వికెట్ల ఫీట్ సాధించాడు. న్యూజీలాండ్ తో జరిగిన మొదటి రెండు టెస్టుల్లో అశ్విన్ ఆరు వికెట్లు తీశాడు. ముంబైలో జరగనున్న మూడో టెస్టులో అశ్విన్ ప్రభావం చూపించే అవకాశముంది. ఈ పిచ్‌ స్పిన్నర్లకు సహకరిస్తుందని తెలుస్తుండగా.. ఈ వేదికలో భారత్, న్యూజిలాండ్ చివరగా 2021 డిసెంబరులో టెస్టు మ్యాచ్‌లో తలపడగా.. స్పిన్నర్లు అత్యధిక వికెట్లు తీశారు. 

ఇది కూడా చదవండి: Iran: అమెరికా ఎన్నికలకు ముందే అణుబాంబు దాడి.. ఇరాన్‌ బిగ్ ప్లాన్!

అజాజ్ పటేల్‌ రికార్డు..

టీమ్ఇండియా 325 పరుగులకు ఆలౌట్ కాగా.. మొత్తం 10 వికెట్లు స్పిన్నర్ అజాజ్ పటేల్‌ తీశాడు. అశ్విన్ (4/8), అక్షర్ పటేల్ (2/14),  సిరాజ్ (3/19) ధాటికి కివీస్ 62 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌ను భారత్ 276/7 వద్ద డిక్లేర్ చేసింది. అజాజ్ పటేల్ 4, రచిన్ రవీంద్ర 3 వికెట్లు తీశారు. 540 పరుగులతో బరిలోకి దిగిన కివీస్ 167 రన్స్‌కు ఆలౌటైంది. భారత స్పిన్నర్లు అశ్విన్, జయంత్ యాదవ్ చెరో నాలుగు వికెట్లు దక్కించుకున్నారు. దీంతో భారత్ ఘన విజయం దక్కించుకుంది. ఇక నవంబర్ 1 నుంచి భారత్-న్యూజీలాండ్ మధ్య 3వ టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే న్యూీజీలాండ్ 0-2 తో సిరీస్ కైవసం చేసుకుంది. 

ఇది కూడా చదవండి: TG Train: తెలంగాణ రైలు ప్రయాణికులకు శుభవార్త.. మరో రెండు కొత్త లైన్లు!

Advertisment
Advertisment
తాజా కథనాలు