Srisailam : శ్రీశైలంలో రూ.19 కోట్లతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణం..ధర్మకర్తల మండలి నిర్ణయం.!
శ్రీశైలవాసులకు, యాత్రికులు, భక్తుల సౌకర్యార్థం రూ. 19కోట్ల అంచనా వ్యయంతో 30 పడకలు ఆసుపత్రిని నిర్మించాలని శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల సమావేశం తీర్మానించింది. దేవస్థానం గోసంరక్షణశాలలో రూ. 36లక్షల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని తీర్మానించారు.