Ananthapuram: రాష్ట్రాన్ని ఆ నాలుగు పార్టీలు ముంచేశాయి: రఘువీరారెడ్డి
ఈనెల 26న అనంతపురం వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నామని తెలిపారు సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జూనియర్ కళాశాల మైదానంలో పరిశీలించారు.
ఈనెల 26న అనంతపురం వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నామని తెలిపారు సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జూనియర్ కళాశాల మైదానంలో పరిశీలించారు.
తిరుపతి రుయా ఆసుపత్రిలో యూనియన్ల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా విధులకు వచ్చిన పారిశుధ్ధ్య కార్మికురాలిపై దాడి కలకలం రేపింది. ఒకవర్గానికి చెందిన వారినే లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో రోగులు, సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారు.
కుప్పంలో నాకు మద్దతిస్తారా..? చంద్రబాబు గారికి మద్దతిస్తారా..? అంటూ సభికులను సరదాగా ప్రశ్నించారు భువనేశ్వరి. చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు.. ఈసారి నన్ను గెలిపిస్తారా..? అంటూ చమత్కరించారు. దీంతో, కార్యక్రమానికి వచ్చిన వాళ్లందరూ ఇద్దరూ కావాలంటూ జవాబిచ్చారు.
జూనియర్ ఎన్టీఆర్ అభిమాని దగ్గర కొడాలి నాని కోటి రూపాయిలు తీసుకున్నారని ఆరోపించారు టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాస్. అది నిజమా? కాదా? అని తేల్చడానికి నాని చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. నమ్మిన దోస్త్ ను మోసం చేసిన దొంగ కొడాలి నాని అని కొలికపూడి మండిపడ్డారు.
తిరుపతిలో రోడ్లపై బైఠాయించి వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు వ్యవసాయ కళాశాల ఉద్యోగులు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ స్పందించకుంటే తమ ఆందోళన కార్యక్రమంను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
రానున్న ఎన్నికల్లో 175 సీట్లు గెలుస్తామని జగన్ మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నారని జనసేన మహిళా విభాగం సెక్రటరీ పెండ్యాల శ్రీలత అన్నారు. దిగువ స్థాయి వర్గాల నుంచి అన్ని వర్గాలలో వైసీపీ పాలన పట్ల పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని విమర్శలు గుప్పించారు.
ఏపీ తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. కత్తిపోట్లతో దుండగులు తీవ్రంగా గాయపరిచారు. ప్రస్తుతం ఒంగోలు సంఘమిత్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వైసీపీకి పెద్ద షాక్ తగలనుంది. మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. గుమ్మనూరు టీడీపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తోంది.