Machilipatnam : జనసేన నేత కారును తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు!
ఏపీలో జనసేన, టీడీపీ నేతలే టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దుండగులు మరోసారి రెచ్చిపోయారు. జనసేన నాయకుడు కర్రి మహేశ్ కారును తగులబెట్టారు. ఇంటిముందు పార్క్ చేసిన కారుకు నిప్పు పెట్టడం తో మహేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.