జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ‘స్టాప్ డయేరియా’ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏపీ వైద్యారోగ్య శాఖ సిద్ధమైంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏపీ వైద్యారోగ్య శాఖ నిర్వహిస్తోంది. ఐదేళ్ల లోపు చిన్నారుల్లో ప్రాణాంతకంగా మారుతున్న డయేరియా వ్యాధిని నిరోధించి మరణాల బారిన పడకుండా ఉండేందుకు కేంద్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ‘స్టాప్ డయేరియా’ ప్రచార కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ మేరకు జూన్ 14 నుంచి సన్నాహక చర్యల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టగా.. జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అన్ని ఏర్పాట్లూ చేసింది.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: జులై 1 నుంచి ‘స్టాప్ డయేరియా’ కార్యక్రమం
జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 'స్టాప్ డయేరియా' అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏపీ వైద్యారోగ్య శాఖ సిద్ధమైంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏపీ వైద్యారోగ్య శాఖ నిర్వహిస్తోంది.
Translate this News: