AP: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం స్కీంపై అప్డేట్.. ఈ జిల్లా నుంచే ప్రారంభించనున్న టీడీపీ సర్కార్..! త్వరలోనే మహిళలకు ఫ్రీ బస్సు స్కీం అందుబాటులోకి తెస్తామన్నారు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. మహిళలకు ఫ్రీ బస్సు స్కీం విశాఖపట్నం నుంచే ప్రారంభిస్తామన్నారు. అయితే, ఏపీలో ఎలాంటి నిబంధనలు పెడతారనే దానిపై ఆసక్తి నెలకొంది. By Jyoshna Sappogula 30 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ విజయనగరం New Update షేర్ చేయండి AP Free Bus Scheme: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ సర్కార్ ఈ స్కీంపై అధ్యయనం చేస్తోంది. తాజాగా, ఇందుకు సంబంధించి అప్డేట్ వచ్చింది. రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే మహిళలకు ఫ్రీ బస్సు స్కీం అందుబాటులోకి తెస్తామన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు స్కీం విశాఖపట్నం నుంచే ప్రారంభిస్తామన్నారు. Also Read: వైసీపీ నాయకుల్లారా కళ్ళు ఉంటే ఇలా చూడండి.. ఎమ్మెల్యే కోటంరెడ్డి సెన్షేషనల్ కామెంట్స్..! మహిళలకు ఫ్రీ బస్సు స్కీంపై కర్ణాటక, తెలంగాణలో అధ్యయనం చేస్తామన్నారు. తెలంగాణలో ఆధార్ కార్డు ప్రామాణికంగా ఉచిత బస్సు ప్రయాణసౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు సర్వీసుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణం చేసేందుకు అవకాశం ఇచ్చారు. అయితే, ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై ఎలాంటి నిబంధనలు పెడతారనే దానిపై ఆసక్తి నెలకొంది. #andhra-pradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి