🔴Live News Updates: యాంకర్ శ్యామల, రీతూ చౌదరిలపై కేసు నమోదు
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
కడపలోని కాశినాయన ఆశ్రమం అన్నదాన సత్రాన్ని ఇటీవల కూల్చివేశారు. దీనిపై శిల్పా రవి స్పందిస్తూ ‘సనాతన ధర్మాన్ని కాపాడటానికి పుట్టిన నాయకులు కాశిరెడ్డి నాయన ఆశ్రమం కూల్చివేతపై స్పందించరా?’ అంటూ పవన్‌పై సెటైరికల్ ట్వీట్ చేశారు. దీనిపై జనసైనికులు ఫైరవుతున్నారు.
కాకినాడలో ఇద్దరు పిల్లలను తండ్రి కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ప్రైవేట్ స్కూల్లో ఎక్కువ లక్షలు కట్టి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలనో లేదో అని చంద్రశేఖర్ ఇలా చేసి ఉంటాడని బంధువులు అంటున్నారు. పిల్లలు చదవడం లేదని చంపే అంతా కర్కశుడు కాదట.
ఏపీలో 10th క్లాస్ పరీక్షలు మార్చి 17 నుండి ఏప్రిల్ 1వరకు జరుగుతాయి. తాజాగా విశాఖ డీఈఓ ఆ జిల్లా వివరాలను వెల్లడించారు. ‘మొత్తం 29,927మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఉదయం 9గం నుంచి మధ్యాహ్నం 12.45 గం వరకు పరీక్షలు జరుగుతాయి’అన్నారు.
జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. బాబు కోసం పుట్టిన తమ్ముడు పార్టీకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు! అంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లకు అంబటి ట్యాగ్ చేశారు.
విశాఖ స్టీల్ సిటీ వద్ద రోడ్డు ప్రమాద ఘటన జరిగింది. అనకాపల్లి నుంచి కూర్మన్నపాలెం బైక్ మీద ఇద్దరు వ్యక్తులు వెళ్తుండగా.. వీరి ద్విచక్రవాహనాన్ని లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మృతి చెందారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్ తగిలింది. వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా పేరుతో భారీ ఎత్తున అవినితీ జరిగిందని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు అంటే మార్చి 12వ తేదీ ఉదయం11 గంటలకు విజయవాడ ఆఫీస్‌కు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.