విజయసాయిరెడ్డికి బిగ్ షాక్ ..సీఐడీ నోటీసులు

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు అంటే మార్చి 12వ తేదీ ఉదయం11 గంటలకు విజయవాడ ఆఫీస్‌కు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

New Update
Vijayasai Reddy resigns from Rajya Sabha membership

Vijayasai Reddy resigns from Rajya Sabha membership

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు అంటే మార్చి 12వ తేదీ ఉదయం11 గంటలకు విజయవాడ ఆఫీస్‌కు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాకినాడ పోర్ట్ వాటాల బదిలీ కేసులో కేవీ రావు ఫిర్యాదుతో 506, 384, 420, 109, 467, 120(బి) రెడ్ విత్ 34 సెక్షన్ల కింద విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. రెండు రోజుల కిందట విజయసాయిరెడ్డి నివాసానికి వెళ్లిన సీఐడీ అధికారులు ఆయన అందుబాటులో లేకపోవటంతో ఆయన సతీమణికి నోటీసులు అందజేశారు.  

Also read :  ఎక్స్‌ సేవల్లో అంతరాయం..ఇది భారీ సైబర్‌ దాడే అంటున్న మస్క్‌!

ఏ2గా విజయసాయిరెడ్డి

ఈ కేసులో  విజయసాయిరెడ్డి ఏ2గా,  మాజీ సీఎం జగన్‌ బాబాయ్‌ వై.వి.సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డి ఏ1గా ఉన్నారు. అయితే విజయిసాయిరెడ్డి విచారణకు వెళ్తారా లేకా సమయం కోరుతారా అన్నది చూడాలి.   ఇక కేఎస్‌పీఎల్, కేసెజ్‌ల్లో వాటాలు కాజేశారన్న వ్యవహారంలో మనీలాండరింగ్‌ జరిగినట్లుగా గుర్తించిన ఈడీ అధికారులు.. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపి కేసు నమోదు చేశారు. ఈ కేసులో రెండు నెలల కిందట విజయసాయిరెడ్డిని ఈడీ విచారించింది. 

Also read :  పొట్టు పొట్టు కొట్టుకున్న విద్యార్థులు.. రచ్చలేపిన గ్యాంగ్ వార్- వీడియో చూశారా?

కాకినాడ సీపోర్టును బెదిరించి అన్యాయంగా వాటాలను కాజేసుకున్నారంటూ ఆ పోర్టు యజమాని కేవీ రావు  సీఐడీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో  ఈ కేసులో విక్రాంత్‌ రెడ్డి, విజయసాయిరెడ్డి, అరబిందో ఫార్మాకు చెందిన శరత్‌ చంద్రారెడ్డి, చెన్నైకు చెందిన ఆడిటింగ్‌ కంపెనీ పీకేఎఫ్‌ ప్రతినిధులు సుందర్‌, విశ్వనాథ్‌, ప్రసన్నకుమార్‌, అపర్ణలను నిందితులుగా చేరుస్తూ సీఐడీ కేసు బుక్ చేసింది.  కాగా ఇటీవల విజయసాయి రాజ్యసభ ఎంపీ పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేశారు. 

Also read :  నిన్ను అత్యంత ప్రేమిస్తున్నాను.. నిహారిక ఎమోష‌న‌ల్ పోస్ట్ ఎవ‌రి గురించో తెలుసా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు