America: ఆ భారతీయ విద్యార్థిని ఆచూకీ చెబితే 10 వేల డాలర్లు..అమెరికా ఎఫ్‌బీఐ!
నాలుగు సంవత్సరాల క్రితం అమెరికాలో మిస్సయిన భారతీయ విద్యార్థిని మయూషి భగత్ ఆచూకీ చెప్పిన వారికి అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ 10 వేల డాలర్ల రివార్డును ప్రకటించింది.
నాలుగు సంవత్సరాల క్రితం అమెరికాలో మిస్సయిన భారతీయ విద్యార్థిని మయూషి భగత్ ఆచూకీ చెప్పిన వారికి అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ 10 వేల డాలర్ల రివార్డును ప్రకటించింది.
అమెరికాలో ఉన్నత వైద్య విద్యను చదవడానికి వెళ్లిన విజయవాడకు చెందిన విద్యార్థిని జహీరా నాజ్ (22) ప్రమాదవశాత్తు కారులో గ్యాస్ లీకై మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
వార్తా బృందానికి చెందిన హెలికాప్టర్ అమెరికాలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు ఫొటో జర్నలిస్టులు మరణించారు. ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది.
ఖలిస్థానీ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు భారతీయులు అమెరికాలో కుట్ర చేసినట్లు వస్తున్న ఆరోపణల మీద తొలిసారి ప్రధాని మోదీ స్పందించారు. ఇతర దేశాల్లో భారతీయుల చేసిన వాటి గురించి వివరాలను ఇస్తే..విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ ఉత్సవాలు అమెరికాలో ఘనంగా మొదలయ్యాయి. జై శ్రీ రాం నినాదాలతో వాషింగ్టన్ వీధులు మార్మోగిపోయాయి. ఫ్రెడ్రిక్ సిటీ మేరీల్యాండ్ సమీపంలోని శ్రీ భక్త ఆంజనేయ ఆలయంలో 'హిందూ అమెరికన్ కమ్యూనిటీ' సభ్యులు సంబరాలు చేసుకున్నారు.
అమెరికాలో టెన్నసీ రాష్ట్రంలో శనివారం సుడిగాలులు విధ్వంసం సృష్టించడంతో ఆరుగురు మృతి చెందారు. మరో 23 మంది గాయాలపాలయ్యారు. ప్రస్తుతం క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. టెన్నసీ నగరాన్ని మరిన్ని సుడిగాలులు తాకొచ్చని వాతావరణ సర్వీసు హెచ్చరించింది.
మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయాలని ఉందని యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగా పేర్కొన్నాడు.ఆయనతో ఓ యాక్షన్ డ్రాప్ సినిమా తీయాలనుందని పేర్కొన్నారు.
గాజాలో తక్షణమే కాల్పులు విరమించాలని ఐరాసలో యూఏఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. దీన్ని అమెరికా తిరస్కరించింది. దీంతో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతిస్తున్నంత కాలం యుద్ధం జరుగుతూనే ఉంటుందని.. ఊహించని, నియంత్రించని పరిణామాలు చోటుచేసుకుంటాయని ఇరాన్ హెచ్చరించింది.
చైనాలో విజృంభిస్తున్న న్యుమోనియా ఇప్పుడు అమెరికాలోనూ విస్తరిస్తోందని చెబుతున్నారు. ఇప్పటికే 142 మంది పిల్లలు దీని బారిన పడ్డారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి రిపబ్లికన్ పార్టీ చట్ట సభ్యులు చైనా పర్యటనలపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు.