పండగపూట ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు ప్రైవేట్ బస్సుల్లో 18 మంది

పద్రాగస్ట్ నాడు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నంద్యాల-తిరుపతి జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. ఈ విషాద ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

New Update
Allagandda accident

Allagandda accident

పద్రాగస్ట్ నాడు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నంద్యాల-తిరుపతి జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. ఈ విషాద ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఆల్ఫా ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సును మరోబస్సు ఢీకొట్టింది. బస్సుల్లో ఇరుకున్న మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. ప్రమాదంలో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు.

ముందు వెళ్తున్న జగన్ ట్రావెల్స్‌ బస్సును వెనుక నుంచి శ్రీకృష్ణ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీకృష్ణ ట్రావెల్స్‌ బస్సులో ఉన్న ఇద్దరు, జగన్‌ ట్రావెల్స్ బస్సులో ఉన్న ఒకరు మృతిచెందారు. మృతదేహాలు ఇరుక్కుపోవడంతో పొక్లెయిన్‌ సాయంతో బయటకు తీశారు. మరణించిన వారు ఎవరనేది తెలియాల్సి ఉంది.. ప్రమాద సమాచారం అందుకున్న 108 సిబ్బంది గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నంద్యాలలోని ఆసుపత్రికి తరలించారు.

Advertisment
తాజా కథనాలు