Allagadda :పాపం.. స్కూల్‌ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో దారుణ ఘటన చోటుచేసుకుంది.  స్కూల్ బస్సు కింద పడి 4 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. శ్రీ కీర్తన స్కూల్లో నర్సరీ చదువుతున్న చిన్నారి హరిప్రియ స్కూల్ బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా అదే బస్సు కింద పడి పాప చనిపోయింది.

New Update
school-bus

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో దారుణ ఘటన చోటుచేసుకుంది.  స్కూల్ బస్సు కింద పడి 4 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. శ్రీ కీర్తన స్కూల్లో నర్సరీ చదువుతున్న చిన్నారి హరిప్రియ స్కూల్ బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా అదే బస్సు కింద పడి పాప చనిపోయింది.  బస్సు ముందు నుంచి వెళ్తుండగా టైర్ కింద పడ్డ చిన్నారి మృత్యువాత పడింది. హరిప్రియ బస్సు దిగి రోడ్డు దాటేందుకు బస్సు ముందు నుంచి వెళ్తుండగా డ్రైవర్ గమనించకుండా బస్సును ముందుకు నడిపించాడు. దీంతో బస్సు టైర్ల కింద పడి హరిప్రియ దేహం ఛిద్రమైంది.  

డ్రైవర్ అజాగ్రత్త వల్లే

డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘటన జరగగానే ఘటనా స్థలం నుంచి బస్ డ్రైవర్ పరారయ్యాడు. చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.   స్కూల్ కి వెళ్లిన తొలిరోజే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడంతో తల్లిదండ్రులు శ్రీధర్, వనజ కన్నీరు మున్నీరవుతున్నారు. శ్రీధర్, వనజ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉండగా.. ఇప్పుడు ప్రమాదంలో కూతురు ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisment
Advertisment
తాజా కథనాలు