Telangana: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువతి మృతి
అమెరికాలో భారతీయ విద్యార్థుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన మరో యువతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మృతురాలిని గుంటపల్లి సౌమ్యగా గుర్తించారు. ఈమె స్వస్థలం యాదగిరిగుట్ట శివారులోని యాదిగిరి పల్లె.