Kerala Health Minister Veena George: భారీ వర్షాల కారణంగా వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని సందర్శించేందుకు మంత్రి బుధవారం తన కారులో బయల్దేరారు. ఈ క్రమంలో మలప్పురం జిల్లాలో మంత్రి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంజేరిలోని చెట్టియాంగడి వద్ద ఎదురుగా వస్తున్న స్కూటర్‌ను తప్పించబోయి కారు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సిబ్బంది మంత్రిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మంత్రి వీణా జార్జ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇదిలా వుంటే వయనాడ్‌లో మృత్యుఘోష ఆగడం లేదు. ఇప్పటికి దాదాపు 254 మంది మరణించినట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Kerala: ప్రమాదానికి గురైన కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్
వయనాడ్ ప్రకృతి వైపరిత్యం జరిగిన ప్రాంతానికి వెళుతుండగా కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ కారుకి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మంత్రి గాయాలతో బయటపడ్డారు. మరోవైపు వయనాడ్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతానికి ఈ సంఖ్య 254 కు చేరుకుంది.
Translate this News: