Bad Newz Trailer: బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి, అమ్మీ విర్క్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘బ్యాడ్ న్యూస్’. డ్రామా, కామెడీ, లవ్, ఎమోషన్ ఇలా ప్రతీ ఎమోషన్ కలిగిన ఈ చిత్రం జులై 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ఆనంద్ తివారీ దర్శకత్వం వహించగా.. ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ పై హీరో యష్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, అమృతపాల్ సింగ్ బింద్రా సంయుక్తంగా నిర్మించారు. నిజజీవిత సంఘటనల స్ఫూర్తితో రూపొందించిన అరుదైన హాస్య చిత్రం ఇది.
‘బ్యాడ్ న్యూస్’ ట్రైలర్
ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఫుల్ కామెడీ, డ్రామా, ఎమోషన్స్ తో సాగిన ఈ ట్రైలర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ తో టాప్ 6 ట్రెండింగ్ గా దూసుకెళ్తోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ పోస్ట్ థ్రియాట్రికల్ రైట్స్‌ను కొనుగోలు చేసింది.