UPI Transactions: ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఉన్న రూ.1 లక్షను రూ.5 లక్షలకు పెంచనున్నట్లు ప్రకటించింది. ఆదాయపు పన్ను, ఆస్తి పన్ను, ముందస్తు పన్ను చెల్లింపులు చేసేవారు ఒక లావాదేవీలో రూ.ఐదు లక్షల వరకు చెల్లించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన నిర్ణయాల వెల్లడి సందర్భంగా ఆర్బీఐ ఈ ప్రకటన చేసింది.
UPI Transactions
UPI Transactions: క్యాష్ వాడటం మానేశారనిపించేలా UPI ట్రాన్సాక్షన్స్..ఇదో రికార్డ్..
ఏప్రిల్ 2024లో 1,330 కోట్ల UPI లావాదేవీలు(UPI Transactions) జరిగాయి. ఈ కాలంలో, మొత్తం ₹ 19.64 లక్షల కోట్లు UPI ద్వారా ట్రాన్స్ ఫర్ అయ్యాయి. ఇది నెలవారీగా చూసుకుంటే రెండో అతి పెద్ద ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చెప్పవచ్చు. వార్షిక ప్రాతిపదికన లావాదేవీల సంఖ్య 50.11% పెరిగింది.
అదే సమయంలో, UPI ద్వారా ట్రాన్స్ ఫర్ అయిన మొత్తం 38.70% పెరిగింది. ఏడాది క్రితం అంటే ఏప్రిల్ 2023లో 886 కోట్ల లావాదేవీల ద్వారా రూ.14.16 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి.
మార్చి 2023లో రికార్డ్ లావాదేవీ జరిగింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) ద్వారా మార్చిలో లావాదేవీల(UPI Transactions) కొత్త రికార్డ్ సృష్టి జరిగింది. ఈ కాలంలో, ఒక నెలలో 1,344 కోట్ల లావాదేవీల ద్వారా గరిష్టంగా 19.78 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి.
అదే సమయంలో, మొత్తం ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ 2023 నుండి మార్చి 2024 వరకు 13,068 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి. ఈ లావాదేవీల ద్వారా, ప్రజలు ₹ 199.95 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు చేశారు. ఇది 2022-23 ఆర్థిక సంవత్సరం కంటే 43.68% ఎక్కువ.
UPI ఎలా పని చేస్తుంది?
UPI సేవ కోసం మీరు వర్చువల్ పేమెంట్ అడ్రస్ ను సృష్టించాలి. ఆ తర్వాత దానిని బ్యాంకు ఖాతాకు లింక్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మీ బ్యాంక్ ఖాతా నంబర్, బ్యాంక్ పేరు లేదా IFSC కోడ్ మొదలైనవాటిని గుర్తుంచుకోవలసిన అవసరం లేదు. పేమెంట్ గేట్ వే మీ మొబైల్ నంబర్ ప్రకారం చెల్లింపు అభ్యర్థనను ప్రాసెస్ చేస్తుంది.
Also Read: బంగారం ధరల మోత..వెండి ధరల బాదుడు..ఈరోజు ఎంత పెరిగాయంటే..
మీరు అతని UPI ID (ఇ-మెయిల్ ID, మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్) కలిగి ఉంటే, మీరు మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా సులభంగా డబ్బు పంపవచ్చు. డబ్బు మాత్రమే కాకుండా యుటిలిటీ బిల్లు చెల్లింపు, ఆన్లైన్ షాపింగ్, షాపింగ్ మొదలైన వాటికి నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ అవసరం ఉండదు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సిస్టమ్ ద్వారా మీరు ఈ పనులన్నింటినీ చేయవచ్చు.
విదేశాల్లోనూ మన యూపీఐ..
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో UPI అంటే ‘యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్’ సేవ ఫ్రాన్స్, శ్రీలంక, మారిషస్‌లలో PM మోడీ ప్రారంభించారు. పారిస్‌లోని ఈఫిల్ టవర్‌పై యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(UPI Transactions) ఇండియన్ ఎంబసీ సహాయంతో తొలిసారిగా ప్రారంభం అయింది. దీని ద్వారా ప్రజలు అక్కడ టిక్కెట్లు, ఇతర సౌకర్యాలను పొందగలుగుతారు. అదేవిధంగా, శ్రీలంక, మారిషస్‌లకు వెళ్లే భారతీయ పౌరులు అలాగే భారతదేశానికి వెళ్లే మారిషస్ పౌరులు దీనిని ఉపయోగించగలరు.
UPI Transactions: ఆ యూపీఐ నెంబర్లు డీయాక్టివేట్ అయిపోతాయి..ఎందుకంటే..
UPI Transactions: డిజిటల్ పేమెంట్స్ యుగంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఒక్కరూపాయి కూడా జేబులో పెట్టుకోకుండా తిరిగేవారు ఎందరో ఉన్నారు. కొన్నేళ్ల క్రితం వరకూ జేబులో ఎంత డబ్బు ఉంటె అంత గొప్ప. ఇప్పుడు.. ఎకౌంట్ లో ఎంత ఉంటె అంత గొప్పగా పరిస్థితి ఉంది. ఇదంతా యూపీఐ పేమెంట్ మహత్యం. మారుమూల ప్రాంతాల్లో కూడా స్కాన్ చేసి పేమెంట్ చేసే సులభమైన మార్గం ఇప్పుడు మనకు ఉంది. అయితే, యూపీఐ పేమెంట్స్ విషయంలో ఎంత ఆధునికంగా మారిపోయామో అంత చిక్కులు కూడా పెరుగుతూ వస్తున్నాయి. మోసాల మాట పక్కన పెడితే, మనకు తెలియకుండా చేసే తప్పులు.. మన డబ్బులు పోగొట్టుకునే పరిస్థితి తీసుకువస్తుంది.
ఉదాహరణకు మీరు ఒక ఫోన్ నెంబర్ బ్యాంకుకు లింక్ చేసుకున్నారని అనుకుందాం. కొన్నాళ్ల తరువాత ఆ ఫోన్ నెంబర్ ఎదో ఇబ్బందుల వల్ల మీరు నిలిపివేశారు. అదే సమయంలో మీ బ్యాంక్ ఎకౌంట్ కూడా వేరే తీసుకోవడంతో పాత బ్యాంక్ ఎకౌంట్.. మీ పాత ఫోన్ నెంబర్ లింక్ కొనసాగుతూనే ఉంటుంది. మీరు మీ పాత ఎకౌంట్ లో కూడా డబ్బులు వేయడం తీయడం తీస్తున్నారు అనుకుందాం. మీరు వదిలివేసిన మీ ఫోన్ నెంబర్ ఇంకొకరికి కేటాయించేస్తారు కదా. అప్పుడు ఆ ఫోన్ నెంబర్ ఎవరికీ వెల్లిందో వాళ్ళు మీ పాత బ్యాంక్ ఎకౌంట్ కు మీ పాత ఫోన్ నెంబర్ ద్వారా ఎక్సెస్ పొందుతారు. అటువంటప్పుడు మీ ఎకౌంట్ లో డబ్బు యూపీఐ ద్వారా ఖాళీ అయిపోతుంది.
ఇలాంటి చాలా చిక్కులు యూపీఐ తో ఉంటాయి. ఇలాంటి వాటికీ చెక్ పెట్టడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రయ్నతాలు మొదలుపెట్టింది. ఈమేరకు ఏడాది పైగా పనిచేయకుండా లేదా ఉపయోగించకుండా వదిలివేసిన అన్ని యూపీఐ ఐడీలు, యూపీఐ నెంబర్లను డీ యాక్టివేట్ చేయాలని యూపీఐ సభ్యులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఏడాది నవంబర్ 7వ తేదీన ఒక సర్క్యులర్ లో బ్యాంకులతో సహా యూపీఐ మెంబర్స్ అందరికీ ఈ ఆదేశాలు పంపించింది.
Also Read: ఆగని బంగారం ధరల పరుగు.. 80వేలకు దగ్గరలో వెండి..
ఎవరైనా వినియోగదారుడు కొత్త మొబైల్ నంబరు తీసుకున్న సందర్భంలో పాత నెంబర్ బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి తొలగించాలి. లేకపోతె సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా డబ్బును పాత నెంబర్ కు పంపించే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ కొత్త గైడ్ లైన్స్ ఇచ్చారు. థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లు(టీపీఏపీ), పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్(పీఎస్పీ) బ్యాంకులు అందరూ కూడా ఈ గైడ్ లైన్స్ ను 2023 డిసెంబరు 31 కల్లా అమలు చేయాల్సి ఉంటుంది.
ఈలోపు యూపీఐని(UPI Transactions) ఏడాదికాలంగా ఉపయోగించని వినియోగదారుల యూపీఐ ఐడీలు, నంబర్లను వీరు గుర్తించాల్సి ఉంటుంది. వారి ఎకౌంట్లలోకి డబ్బు రాకుండా వాటిని డీ యాక్టివేట్ చేయాలి. యూపీఐ మ్యాపర్ నుంచి కూడా ఈ నంబర్లకు సంబంధించిన వివరాలు డీరిజిస్టర్ చేయాల్సి ఉంటుంది.
ఈ తాజా మార్గదర్శకాలు వినియోగదారుల రక్షణ కోసమే. అలాగే వినియోగదారులు కూడా ఎప్పటికప్పుడు బ్యాంకులతో తమ సమాచారాన్ని అప్ డేట్ చేసుకుంటూ ఉండాలి. చిరునామా మార్పు, మొబైల్ నెంబర్ మార్పు వంటి వాటిని బ్యాంక్ ఎకౌంట్ లో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలి.
Watch this interesting Video: