Nayanthara Romance With ‘KGF’ Hero : సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతారకి సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ ప్రస్తుతం కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లో తెగ హల్చల్ చేస్తోంది. నయన్ తనకంటే చిన్న వయసున్న హీరోతో రొమాన్స్ చేసేందుకు రెడీ అయిందట. ఈ న్యూస్ విని ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇంతకీ నయన్ రొమాన్స్ చేయబోయే హీరో ఎవరు? వివరాల్లోకి వెళ్తే..
‘KGF’ హీరోతో నయన్ రొమాన్స్
నయనతార ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది. గత ఏడాది షారుఖ్ ఖాన్ సరసన జవాన్ మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఇప్పుడు తమిళ్ తో పటు కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది.
అయితే తాజాగా ఈ హీరోయిన్ వయసులో తన కంటే చిన్నవాడైనా ‘KGF’ హీరో యష్ తో రొమాన్స్ చేయబోతోందట. యష్ లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘టాక్సిక్’ లో నయనతారను హీరోయిన్ గా ఫైనల్ చేయునట్లు టాక్ వినిపిస్తోంది. ఈ విషయం తెలిసిన పలువురు తనకంటే వయసులో చిన్నవాడైన యష్ కి పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ఉండటంతోనే నయన్ అతనితో నటించేందుకు ఒప్పుకుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కరీనా కపూర్ స్థానంలో
నిజానికి ‘టాక్సిక్’ లో మొదట కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కరీనా కపూర్ కూడా తాను ఓ సౌత్ మూవీలో నటిస్తున్నట్లు పరోక్షంగా హింట్ ఇచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం షూటింగ్ క్యాల్షీట్స్ సర్దుబాటు చేయలేని కారణంగా కరీనా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా.. ఆమె స్థానంలో నయనతారను తీసుకోవాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తుందట.