Toxic movie: మైండో బ్లోయింగ్.. యష్ కోసం రంగంలోకి హాలీవుడ్ డైరెక్టర్! కన్నడ స్టార్ హీరో యష్ ‘టాక్సిక్’ మూవీ టీంలో ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జెజె పెర్రీ జాయిన్ అయ్యాడు. జాన్ విక్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజీలతో గుర్తింపు తెచ్చుకున్న పెర్రీ ఇప్పుడు టాక్సిక్‌లో అడుగుపెట్టడంతో ఉత్కంఠ మొదలైంది. By Seetha Ram 09 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి కన్నడ స్టార్ హీరో యష్ ‘కేజీఎఫ్’ సినిమాతో పాన్ ఇండియా హీరో జాబితాలోకి చేరిపోయాడు. అప్పటి వరకు చాలా సినిమాలే చేశాడు. కానీ అవేవి పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. కానీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్’ సినిమాతో యష్ పేరు మారుమోగిపోయింది. ఈ చిత్రం బాక్సాఫీసును షేక్ చేసింది. Also Read: మోదీకి రేవంత్ వార్నింగ్.. మహారాష్ట్ర ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు! కనీ వినీ ఎరుగని రీతిలో దుమ్ముదులిపేసింది. అనంతరం కేజీఎఫ్ 2 కూడా రిలీజ్ అయి సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఎన్నో సినిమాల రికార్డులను సైతం బద్దలు కొట్టింది. ఇలా ఈ రెండు సినిమాలతో యష్ క్రేజ్ పెరిగిపోయింది. Also Read: రోడ్డు మీద ఉమ్మివేస్తున్నారా జాగ్రత్తా.. వారి కంటపడితే ఖతమే! సాధారణంగా ఒక సాధారణ హీరో పాన్ ఇండియా రేంజ్ స్టేటస్ తెచ్చుకోవాలంటే ఎన్నో సినిమాలు చేయాలి. అవి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. కానీ యష్ కష్టానికి తోడు లక్కు కలిసి రావడంతో కేజీఎఫ్‌తోనే పాన్ ఇండియా హీరో అయిపోయాడు. దీంతో అతడు చేయబోయే నెక్స్ట్ సినిమాపై అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. తన తదుపరి చిత్రాన్ని ఇటీవలే ప్రకటించాడు. ఇది కూడా చూడండి: ఉదయాన్నే గ్రీన్ టీ తాగేటప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తున్నారా? సమ్మర్‌లో రిలీజ్ మలయాళ నటి, డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ అనే మూవీ చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. అంతేకాకుండా ఈ చిత్రం షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ అంటే ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్టేడ్ వచ్చింది. Hollywood Action Director JJ Perry Joined #Toxic today 🔥🔥Get ready to witness the never before action in Indian Cinema #ToxicTheMovie #YashBOSS @TheNameIsYash pic.twitter.com/DBlbwdpTlR — Yash Trends ™ (@YashTrends) November 9, 2024 ఇది కూడా చూడండి: ఇక్కడ చేసిన ఫుడ్ తిన్నారో.. ఒక్కసారికే పైకి పోవడం గ్యారెంటీ! ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జేజే పెర్రీ ఈ మూవీ టీంలో చేరారు. దీంతో టాక్సిక్ పై అంచనాలు రెట్టింపయ్యాయి. పెర్రీ ముంబై విమానాశ్రయంలో కనిపించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా టాక్సిక్ షూటింగ్‌లో భాగంగా యష్ పై ముంబైలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అందులో జాయిన్ కావడానికి హాలీవుడ్ డైరెక్టర్ వచ్చారు. అయితే ఈ సినిమాలో అతడు నటిస్తాడా? లేక యాక్షన్ సన్నివేశాలకు డైరెక్షన్ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ అప్డేట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుస్ అవుతున్నారు. #toxic-movie #kgf-hero-yash మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి