Toxic Movie: రిలీజ్ కి ముందే యష్ 'టాక్సిక్' అరుదైన ఫీట్.. మరో కేజీఎఫ్ కానుందా?

కేజీఎఫ్ స్టార్ యష్ మూవీ 'టాక్సిక్' సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఒకేసారి కన్నడ, ఇంగ్లీష్ రెండు భాషల్లో చిత్రీకరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఒకేసారి రెండు భాషల్లో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ మూవీ టాక్సిక్ కానుంది.

New Update
toxic movie update

toxic movie update

Toxic Movie: కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ తర్వాత యష్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్  'టాక్సిక్'.  A Fairy Tale For Grown Ups అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేస్తున్నారు. యష్ సొంత బ్యానర్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, కెవిఎన్ ప్రొడక్షన్స్  బ్యానర్స్ పై వెంకట్ కె నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లిమ్ప్స్ లో యష్ విజువల్స్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. 

Also Read: Allu Aravind: వావ్! అమ్మాయితో కలిసి ఆలు అల్లు అరవింద్‌ భలే డాన్స్ వేశారు! వీడియో చూశారా

తొలి ఇండియన్ సినిమా 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ పంచుకున్నారు మేకర్స్.  'టాక్సిక్' ఒకేసారి రెండు భాషల్లో షూట్ చేస్తున్నట్లు తెలిపారు. కన్నడ, ఇంగ్లీష్‌ భాషల్లో చిత్రీకరిస్తున్నారు. దీంతో ఒకేసారి రెండు భాషల్లో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ సినిమాగా టాక్సిక్ నిలువనుంది. అలాగే హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో కూడా డబ్బింగ్ చేయనున్నట్లు ప్రకటించారు.  1970 గోవా, కర్ణాటక బ్యాక్‌ డ్రాప్‌లో ఈ సినిమా కథ ఉండబోతున్నట్లు ఇన్‌సైడ్‌ టాక్‌.

టాక్సిక్ చిత్రంలో కియారా అడ్వానీ, తార సుతారియా, శృతి హాసన్, నయనతార తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఇందులో నయన్ యష్ కి అక్క పాత్రలో  కనిపించనున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఈ పాత్ర కోసం కరీనా కపూర్ ని అనుకున్నారట.  కానీ మళ్ళీ నయన్ ని ఫైనల్ చేసినట్లు సమాచారం. కేజీఎఫ్ తర్వాత యష్ నుంచి రాబోతున్న ఈ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. 

Also Read: Kurchi Madathapetti: 'కుర్చీ మడతపెట్టి' పాటకు యమ క్రేజ్.. నేపాల్ వీధుల్లో దుమ్మురేపిన అమ్మాయిలు! వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు