Yash: కేజీఎఫ్ హీరోకు కష్టాలు.. కేసు నమోదు, అసలేం జరిగింది? యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ మూవీ చిక్కుల్లో పడింది. ఈ మూవీ నిర్మాతలపై కర్నాటక అటవీ శాఖ కేసు నమోదు చేసింది. బెంగళూరులోని పీణ్య వద్ద సినిమా షూటింగ్ కోసం అనుమతి లేకుండా భారీగా చెట్లు నరికివేయడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కేసు నమోదు అయింది. By Seetha Ram 13 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి కేజీఎఫ్ సినిమాతో ఓ రేంజ్‌లో ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు కన్నడ స్టార్ హీరో యష్. ఈ సినిమాతో అతడి పేరు మారుమోగిపోయింది. మొదటి పార్ట్ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మాస్ ఎలివేషన్స్‌తో దుమ్ము దులిపేసింది. దీనికి రెట్టింపు అంచనాలతో వచ్చిన సెకండ్ పార్ట్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా తర్వాత యష్ మరో సినిమా తీయలేదు. ఇది కూడా చదవండి: అడ్డంగా బుక్కైన ఆర్టీసీ డ్రైవర్.. బస్సు నడుపుతూనే దొంగతనం! ఇక ఇప్పుడిప్పుడే ఒక కొత్త సినిమా మొదలు పెట్టాడు. తన కెరీర్‌లో 19వ సినిమా చేస్తున్నాడు. మలయాళ నటి, డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో నయనతార ఇందులో యష్‌కి అక్కగా నటిస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఇక అన్నీ అనుకున్నట్లుగానే సినిమా షూటింగ్ శరవేగంగా దూసుకుపోతుందనుకుంటున్న సమయంలో ఇటీవల కొన్ని వివాదాలు ‘టాక్సిక్’ని చుట్టుముట్టాయి. ఈ సినిమా షూటింగ్ సమయంలో అన్యాయంగా వేలాది చెట్లు నరికేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే అది నిజమనేలా ఇప్పుడు కర్ణాటక అటవీ శాఖ టాక్సిక్ మూవీపై పోలీస్ కేసు పెట్టింది. టాక్సిక్ నిర్మాతలపై కర్నాటక అటవీ శాఖ కేసు పెట్టింది. ఇది కూడా చదవండి: కలెక్టర్ పై దాడి ఎలా చేశారంటే.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు! కేసు నమోదు బెంగళూరులోని పీణ్య వద్ద టాక్సిక్ చిత్ర యూనిట్ సినిమా కోసం గతంలో భారీగా చెట్లు నరికివేసిందని.. అనుమతి లేకుండా చెట్లు నరికివేయడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే చిత్ర యూనిట్‌పై కర్నాటక అటవీశాఖ మంత్రి సీరియస్ అయ్యారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. Also Read : లగచర్లలో మళ్లీ హై టెన్షన్..! అసలేం జరిగింది? ఇటీవల బెంగళూరులోని పీణ్య-జలహళ్లి దగ్గరలో ‘టాక్సిక్’ మూవీ షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ జరుగుతున్న స్థలానికి సంబంధించి కర్ణాటక అటవీశాఖ, హిందుస్థాన్ మెషిన్ టూల్స్ మధ్య గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోంది. అదే సమయంలో షూటింగ్ కోసం టాక్సిక్ యూనిట్ కొద్ది రోజులకు లీజుకు తీసుకుంది. ఆ సమయంలోనే భారీగా సెట్స్ వేసేందుకు వందలాది ఎకరాల భూమిలోని చెట్లను నరికివేశారని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అక్కడికి చేరుకున్న అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఫైర్ అయ్యారు. ఇలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పుడు అది సీరియస్ కావడంతో టాక్సిక్ మూవీ నిర్మాతలపై కేసు నమోదు అయింది. Also Read : రాశీఖన్నా కు బ్రేకప్.. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన హీరోయిన్? #karnataka-forest-department #kannada-actor #toxic-movie #yash మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి