KTR: తెలంగాణ రైతులను సీఎం రేవంత్ దారుణంగా మోసం చేశాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రుణమాఫీ పచ్చి మోసం, పచ్చి దగా.. రైతులను మోసం చేసినందుకు సీఎం రేవంత్ చీటింగ్ కేసు పెట్టాలన్నారు. అంతేకాదు ‘నువ్వు చేసిన రుణమాఫీ నిజమైతే నీ నియోజకవర్గానికే మీడియాతో కలిసి వెళ్దాం’ అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.
రాజకీయాలను వదిలేస్తా..
ఒక్క రైతు వేదికలో వంద శాతం రుణమాఫీ జరిగిందని ఒక్క రైతు చెప్పిన నేను రాజకీయాలను వదిలేస్తా. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఈ పచ్చిమోసాన్ని మేము ఎండగడతాం. సీఎంకు దమ్ముంటే నా సవాల్ ను స్వీకరించాలని ఛాలెంజ్ చేస్తున్నా. సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి వెళితే రేవంత్ రెడ్డిని ప్రజలు ఫుట్బాల్ ఆడుతారు. సగం కూడా రుణమాఫీ చేయకుండా మొత్తం సంపూర్ణంగా రుణమాఫీ చేశామని చెబితే అది సంపూర్ణంగా దిగజారటమే. రేవంత్ రెడ్డి పిచ్చి, పిచ్చి మాటలు మానేయాలి. నువ్వు రైతుల దగ్గరకు పోతే వాళ్లు నీతో చెడుగుడు ఆడుతారు. ఇంత దిగజారుడు ముఖ్యమంత్రి, దివాళా తీసిన ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదంటూ విమర్శలు గుప్పించారు కేటీఆర్.