Mahua Moitra: తృణముల్ కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహువా మొయ్త్రా (Mahua Moitra) తన ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మీ ఎనర్జీకి కారణం ఏంటని అడిగిన ప్రశ్నకు ఆమె ‘సె*క్స్’ అంటూ ఆమె ఆన్సర్ ఇచ్చారు. మహువా ఈ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లోని కృష్ణానగర్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఎన్నికల ప్రచారంలో ఆమె బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రిపోర్టర్ అడిన ప్రశ్నకు సమాధానంగా మహువా మొయ్త్రా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలను మహువా ఎలా సమర్థించుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది. నెటిజన్లు మాత్రం ఈ వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు.
Some say Boost is the secret of my energy and some legend say s*x is the source of my energy #mahuamoitra 🤯 pic.twitter.com/DRVkQZ4DTq
— ꜱᴀɴᴄʜɪᴛ (@sanchit_gs) April 18, 2024
మహువా మొయిత్రా ఎంపీ సభ్యత్వాన్ని గతంలో రద్దు చేస్తూ పార్లమెంట్ తీర్మానం చేసింది. డబ్బులు తీసుకొని పార్లమెంట్ లో అదానీ గ్రూపునకు వ్యతిరేకంగా మహువా ప్రశ్నలు అడిగినట్లు వచ్చిన ఆరోపణలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమె పార్లమెంట్ లాగిన్ ఐడీ, ఇతరులకు షేర్ చేసిందన్న పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మెహూవాపై పార్లమెంట్ వేటు వేసింది. అయితే.. తన వివరణను తీసుకోకుండానే తనను ఉరి తీయాలని ఎథిక్స్ కమిటీ డిసైడ్ అయ్యిందని మహువా మొయ్త్రా ఆ సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు.