Mahua Moitra: ఎథిక్స్ కమిటీ రాజ్యాంగ విలువలకు తూట్లు పొడిచింది.. మహువా మొయిత్ర ఫైర్
లోకసభ నుంచి తనను బహిష్కరించడంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మెయిత్ర ఫైర్ అయ్యారు. నిబంధనలు పాతరేసి ఎథిక్స్ కమిటీ వ్యవహరించిందని విమర్శించారు.
లోకసభ నుంచి తనను బహిష్కరించడంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మెయిత్ర ఫైర్ అయ్యారు. నిబంధనలు పాతరేసి ఎథిక్స్ కమిటీ వ్యవహరించిందని విమర్శించారు.
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను పార్లమెంటు నుంచి బహిష్కరించడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ స్పందించారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు జరిగిన ద్రోహమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో మమ్మల్ని ఓడించలేకే ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
పారిశ్రామికవేత్త నుంచి డబ్బులు తీసుకోని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారని ఆరోపణల నేపథ్యంలో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వాన్ని పార్లమెంటు రద్దు చేసింది. దీంతో విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా తమను అణిచివేసేందుకే కుట్ర చేశారని మహువా మండిపడ్డారు.
క్యాష్ ఫర్ క్వరీ ఆరోపణలను ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణకు ఎథిక్స్ కమిటీ ఇవాళ లోక్ సభలో నివేదిక ప్రవేశ పెట్టనుంది. దీని మీద లోక్ సభ నేడే నిర్ణయం తీసుకోనుంది. ఇది కనుక అమోదం పొందినట్లయితే ఆమె బహిష్కరణకు గురవుతారు.
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో లోక్‌పాల్ ఆదేశాల మేరకు సీబీఐ పార్టీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ప్రాథమిక ఆధారాల ఆధారంగా మహువాపై కేసు నమోదు చేయాలా? వద్దా అనే దానిపై సీబీఐ నిర్ణయం తీసుకోనుంది.
డబ్బులు తీసుకొని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మహువా మొయిత్రా వివాదంపై టీఎంసీ అధినేత్రి మమదా బెనర్జీ స్పందించారు. మహువాను లోక్ సభ నుంచి బహిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారని.. కానీ లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇదే ఆమెకు సాయపడుతుందని వ్యాఖ్యానించారు.
అదాని సంస్థ రూ.13 వేల కోట్ల కుంభకోణానానికి పాల్పడిందని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. ఈ కుంభకోణం గురించి ప్రశ్నించేవారి గొంతు నొక్కేయాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఇలాంటి సంఘటన వేరే దేశాల్లో జరిగితే అక్కడి ప్రభుత్వాలు కూలిపోతాయన్నారు.
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్‌సైభ నైతిక విలువల కమిటీ సిఫార్సు చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి 500 పేజీలతో కూడిన నివేదికను శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభ స్పీకర్‌కు సమర్పించనున్నట్లు తెలుస్తోంది.
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంటరీ ఖాతాను దుబాయ్ నుంచి దాదాపు 47 సార్లు వినియోగించినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించినట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మరోసారి ఆరోపణలు చేశారు. ఇవి నిజమని తేలితే ఎంపీలందరూ ఆమె అవినీతిని వ్యతిరేకించాలని కోరారు.