కేరళలోని కొచ్చిలో ఘోర ప్రమాదం జరిగింది. సంగీత కచేరీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో నలుగురు విద్యార్థులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు విద్యార్థినులు కూడా ఉన్నారు. , మరో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కలమస్సేరి మెడికల్ కాలేజీలో చేర్చారు, అక్కడ ఇప్పటివరకు 46 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. కొందరు విద్యార్థులను ప్రయివేటు ఆసుపత్రులకు కూడా పంపినట్లు సమాచారం. గాయని నికితా గాంధీ పాటల కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కావాల్సి ఉందని చెబుతున్నారు.
6.30 గంటలకు ప్రారంభమైన ఈ ఓపెన్ ఆడిటోరియం అప్పటికి పూర్తిగా నిండిపోయింది. ఆడిటోరియం చుట్టూ జనం కూడా ఉన్నారు. అదే సమయంలో అకస్మాత్తుగా భారీ వర్షం కురవడంతో బయట నిల్చున్న వారు లోపలికి పరుగులు తీయడం, రద్దీ పెరగడంతో తొక్కిసలాట జరిగి ఈ ప్రమాదం జరిగింది.
Kerala | Stampede-like situation at CUSAT University in Kochi. Four students dead and many injured as per Health Minister Veena George. The accident took place during a music concert by Nikhita Gandhi that was held in the open-air auditorium on the campus. Arrangements have been…
— ANI (@ANI) November 25, 2023
ఇది కూడా చదవండి: హార్బర్లో అరాచకాలు! మందు పార్టీలు, గంజాయి బ్యాచ్లు!