Bollywood : బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్(Most Beautiful Couples) లో ఒకరు సైఫ్ అలీఖాన్- కరీనా(Saif Ali Khan – Kareena Kapoor). 2012 లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. బి-టౌన్‌లోని హాటెస్ట్ సెలెబ్స్లో ఒకరైన ఈ జంట సోషల్ మీడియా(Social Media)లోనూ యాక్టివ్ గా కనిపిస్తారు. ఎల్లప్పుడూ వారికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.
సైఫ్ చేతి పై కొత్త టాటూ
అయితే తాజాగా సైఫ్అలీఖాన్ చేతి పై కనిపించిన కొత్త టాటూ(Tattoo) నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. చాలా సంవత్సరాల క్రితం తన భార్య కరీనా కపూర్ ఖాన్ పేరును తన చేతిపై టాటూగా వేయించుకున్నాడు. కానీ తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ కనిపించిన సైఫ్ చేతి పై కొత్త టాటూ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కరీనా పేరుకు బదులుగా ఆయన చేతి పై త్రిశూలం టాటూ కనిపించడంతో పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు సైఫ్, కరీనా ఇద్దరి మధ్య ఏదైనా జరిగిందా?’ ‘అంతా ఓకేనా?’ ‘సైఫ్, కరీనా విడాకులు తీసుకోబోతున్నారా?’ అంటూ సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram
టాటూ నిజమేనా..?
అయితే సైఫ్ అలీఖాన్ టాటూ కేవలం టెంపరరీ అన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసమే అతను ఈ ప్రత్యేక టాటూను వేయించుకున్నట్లు సమాచారం. కరీనా పేరుపై త్రిశూల్ డిజైన్ ఇంక్ చేయబడిందని. చిత్రీకరణ పూర్తయిన తర్వాత, త్రిశూల్ తొలగించబడుతుంది, అసలు టాటూ( కరీనా పేరు) కనిపిస్తుంది అని చెబుతున్నారు. దీంతో సైఫ్మ, కరీనా ధ్య ఏదో జరిగింది అని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదు అని అర్థమవుతోంది.
Also Read: Brahmamudi: దుగ్గిరాల ఇంట్లో మళ్ళీ చిచ్చు పెట్టిన రుద్రాణి.. అపర్ణకు షాకిచ్చిన కళ్యాణ్..!