/rtv/media/media_files/2025/02/12/FxyvAzwGP7ubz0zylcZ1.jpg)
saif ali khan divorce
Saif Ali Khan: ఒకప్పుడు పెళ్లంటే నూరేళ్ళ బంధం అనేవారు.. కానీ ఇప్పుడు పెళ్లంటే మూడునాళ్ళ ముచ్చట అనే పరిస్థితికి వచ్చింది. ప్రస్తుతం దేశంలో విడాకులు(Divorce) తీసుకునే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఈ మధ్య సెలెబ్రెటీల విడాకుల(Celebrity Divorce) వార్తలు మరీ ఎక్కువగా వినిపిస్తున్నాయి. పెళ్ళైన రెండు మూడు సంవత్సరాలకే విడాకుల బాటపడుతున్నారు. అయితే తాజాగా మరో స్టార్ హీరో, హీరోయిన్ కూడా విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read: Big Breaking: రామమందిర ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ కన్నుమూత!
కరీనా పోస్ట్ కు అర్థం అదేనా
కరీనా కపూర్(Kareena Kapoor) భర్త సైఫ్ అలీఖాన్ కి విడాకులు ఇవ్వబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 2012లో ప్రేమించి పెళ్లి సైఫ్, కరీనాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తైమూర్, జహంగీర్ అలీ ఖాన్. అయితే తాజాగా కరీనా తన సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఈ పుకార్లకు తెరలేపింది. ''పెళ్లిళ్లు, విడాకులు, పిల్లలు, టెన్షన్స్, చైల్డ్ బర్త్, ఇష్టపడిన వ్యక్తి చనిపోవడం, పిల్లల పెంపకం...ఇవన్నీ మీకు జరిగే వరకు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. మీ వంతు వచ్చినప్పుడు, మిమల్ని జీవితం మార్చే వరకు.. అసలు పరిస్థితి ఏంటో అర్థం కాదు. అప్పటివరకు చాలా మంది కంటే మనం తెలివైన వాళ్లమని అనుకుంటాము'' అంటూ ఇన్స్టాలో స్టోరీ షేర్ చేశారు.
/rtv/media/media_files/2025/01/16/HyaXQ2r0hyanmm8rraTc.jpg)
Also Read: supreme Court: బస్సు ప్రమాదంలో చనిపోయిన మహిళకు రూ.9 కోట్ల పరిహారాన్ని చెల్లించాల్సిదే
గతంలో కూడా
అయితే గతంలో కూడా కరీనా, సైఫ్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ రూమర్స్ వచ్చాయి. సైఫ్ తన చేయిపై ఉన్న కరీనా టాటూ తొలగించి.. ఆ స్థానంలో త్రిశూలం ఆకారంలో కొత్త టాటూను వేయించుకున్నట్లు ఫొటోలు వైరలవడంతో విడాకుల వార్తలు తెరపైకి వచ్చాయి. కానీ ఆ తర్వాత సైఫ్, కరీనా కలిసి తమ వెడ్డింగ్ యానివర్సరీని గ్రాండ్ గా జరుపుకోవడంతో.. అవి కేవలం పుకార్లేనని తేలిపోయింది. కాగా, ఇప్పుడు మళ్ళీ కరీనా అలాంటి పోస్ట్ షేర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో వీరిద్దరూ నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సైఫ్ పై దాడి జరిగి నెలరోజులు కూడా కాకముందే.. విడాకుల వార్తలు రావడం హాట్ టాపిక్ గా మారింది. అయితే సైఫ్ తన మొదటి భార్య అమ్రితా సింగ్ తో విడిపోయిన తర్వాత కరీనా కపూర్ ని వివాహం చేసుకున్నారు. 2024లో సైఫ్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు. వీరికి సారా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్ ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Also Read: Chiranjeevi: ఎంత మాటన్నావ్ చిరు.. స్టేజీపైనే మెగాస్టార్ బూతులు: నెటిజన్ల ట్రోలింగ్