Human GPS Bagu Khan : వీడో హ్యూమన్ జీపీఎస్..చొరబాట్ల దారులన్నీ వీడి మైండ్లోనే...
ఉగ్రవాదుల్లో హ్యూమన్ జీపీఎస్గా పిలవబడే బాగూఖాన్(సమందర్ చాచా)ను కాల్చిచంపినట్లు ఆర్మీవర్గాలు ఈ రోజు వెల్లడించాయి. తీవ్రవాదులెందరికో చొరబాటు దారులు చెప్పిన అతడు మరో ఉగ్రవాదితో కలిసి దేశంలోకి చొరబడేందుకు యత్నించగా ఎన్కౌంటర్ చేశామని అధికారులు తెలిపారు.