Minister Ponguleti Srinivas: ఖమ్మం జిల్లా పాలేరు ప్రజల దగ్గరకే పొంగులేటి కార్యక్రమం చెప్పట్టారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర పగ్గాలను అప్పగించారని అన్నారు. తెలంగాణలో దొరల పాలన పోయి ప్రజా పాలన వచ్చిందని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. ఎన్నికల సమయంలో చెప్పినట్టు గానే ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని తెలిపారు. త్వరలో ఇళ్లు లేని వారిని గుర్తించి వారందరికీ ఇళ్లు కట్టిస్తాం అని అన్నారు. త్వరలోనే అర్హులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు ఇస్తామన్నారు.