Hajj Yatra: హజ్ యాత్రలో 550 మందికి పైగా యాత్రికుల మృతి!
సౌదీ అరేబియాలో ఎండ తీవ్రత హజ్ యాత్రికులను అల్లకల్లోలం చేస్తుంది. వేడి వల్ల ఇప్పటి వరకు హజ్ యాత్రలో కనీసం 550 మంది హజ్ యాత్రికులు చనిపోయారు.ఈజిప్ట్ దేశస్థులు ఎక్కువగా మరణించారు.
సౌదీ అరేబియాలో ఎండ తీవ్రత హజ్ యాత్రికులను అల్లకల్లోలం చేస్తుంది. వేడి వల్ల ఇప్పటి వరకు హజ్ యాత్రలో కనీసం 550 మంది హజ్ యాత్రికులు చనిపోయారు.ఈజిప్ట్ దేశస్థులు ఎక్కువగా మరణించారు.
మలావీ ఉపాధ్యక్షుడు 'సౌలస్ షిలిమా' ప్రయాణించే విమానం తప్పిపోయిన కథ విషాందాంతమైంది. అందులో ఉన్న 10 మంది దుర్మరణం చెందినట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. విమానం పర్వత ప్రాంతాల్లో కూలిపోయింది. అందులో ఎవరూ ప్రాణాలతో లేరు' అని మలావీ దేశాధ్యక్షుడు లాజరస్ చక్వేరా వెల్లడించారు.
రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం 4.50 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయనకు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిష్ రావు తల్లి ఈ రోజు మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆమె కరీంనగర్ హాస్పిటల్ లో మరణించారు. తల్లి మృతి పై రాధా కిషన్ రావు అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి చెందినట్లు ఆ దేశ అధికారులు ధృవీకరించారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయి 20 గంటలకు పైగా గడిచింది. సోమవారం ఉదయం హెలికాఫ్టర్ కూలిపోయిన ప్రదేశాన్ని మాత్రం అధికారులు గుర్తించారు.
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ షేక్ అక్మల్ అనుకోని సంఘటనతో ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ అంజయ్యనగర్‌లోని షణ్ముఖ్ మెన్స్ పీజీ హాస్టల్లో ఉంటున్న యువకుడు అదే హాస్టల్ సంపులో పడి చనిపోయాడు. వీడియో వైరల్ అవుతోంది. హాస్టల్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు.
హెలికాఫ్టర్ కూలిన ఘటనలో కెన్యా దేశ మిలటరీ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒగొల్లా దుర్మరణం పాలయ్యారు. ఈ హెలికాఫ్టర్ లో ఆయనతో పాటు మరో తొమ్మిది మంది మరణించారు.కెన్యాలోని మిలిటరీ దళాల తనిఖీల కోసం మిలిటరీ చీఫ్ వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.
ఉత్తరప్రదేశ్ మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ గురువారం గుండెపోటుతో మరణించారు.అయితే గతంలో మాజీ డీఎస్పీ శైలేంద్ర సింగ్ పై ముఖ్తార్ అన్సారీ ఎలాంటి ఒత్తిడి తీసుకువచ్చారో శైలేంద్రసింగ్ తెలిపారు.