Actress Sreeleela : టాలీవుడ్ లో పెళ్లి సందD, ధమాకా సినిమాలతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన శ్రీలీల ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. గత ఏడాది ఏకంగా అరడజనుకు పైగా సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలేవీ సక్సెస్ కాలేదు. దీంతో ప్రస్తుతం తెలుగులో ఈ హీరోయిన్ కి పెద్దగా ఆఫర్స్ రావడం లేదు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ యంగ్ హీరోయిన్ ఏకంగా మెగాస్టార్ మూవీనే రిజెక్ట్ చేసిందట. ప్రెజెంట్ ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతుంది. చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సోషియో ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్ చేసేందుకు మూవీ టీమ్ శ్రీలీలని సంప్రదించారట.
Also Read : ఒలింపిక్స్ విజేతలు నీరజ్, నదీమ్ బయోపిక్స్.. నటించేది ఎవరంటే?
కానీ ఆమె నో చెప్పిందట. రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తామని చెప్పినా సరే మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసిందని టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతానికి శ్రీలీలకు ఐటం సాంగ్స్ చేయడం తనకి ఇష్టం లేదని, కేవలం హీరోయిన్ రోల్స్ పైనే దృష్టి సారించడంతో ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు ఇన్సైడ్ వర్గాల సమాచారం. కాగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘విశ్వంభర’ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.