/rtv/media/media_files/2025/02/15/JxRG19MDAFNsp3Lgblfn.jpg)
VISHWAMBHARA
Vishwambhara: యువీ క్రియేషన్స్ బ్యానర్ పై మల్లాడి వసిష్ఠ దర్శకత్వంలో భారీ అంచనాలతో రూపొందుతున్న మెగాస్టార్ లేటెస్ట్ ఫిల్మ్ 'విశ్వంభర'. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం ఈఏడాది జూన్ లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది.
Also Read: Spirit Casting Call: ఇదెక్కడి క్రేజ్.. ప్రభాస్ తో నటించేందుకు మంచు విష్ణు అప్లికేషన్
మరో మెగా హీరో క్యామియో..
మెగాస్టార్ 'విశ్వంభర' మరో మెగా హీరో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో చిన్న మామ పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న సాయి తేజ్.. ఇప్పుడు పెద్ద మామతో కూడా కలిసి తెరపై అలరించబోతున్నారట. తేజ్ 'విశ్వంభర' లో స్పెషల్ క్యామియో చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్లు టాక్.
Also Read: Prabhas Spirit Casting Call: డార్లింగ్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్.. ఆ సినిమాలో నటించే అవకాశం..!
#Vishwambhara - Sai Durgha Tej’s cameo is confirmed. Also, it is said that ‘Mega Daughter’ will have a special appearance in the film. pic.twitter.com/GzdTV2b3rt
— Aakashavaani (@TheAakashavaani) February 15, 2025
రెండు పాటలు, కొన్ని చిన్న ప్యాచ్‌వర్క్‌లు మినహా సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. అలాగే కీలకమైన సన్నివేశాలలో చాలా వరకు CGI వర్క్ మిగిలి ఉంది. అయితే సినిమా CGI వర్క్ పై మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారట. గతంలో మూవీ టీజర్ విడుదల చేయగా.. నాసిరకం CGI కారణంగా భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కొంది. దీంతో చిత్రబృందం అత్యున్నత స్థాయి విజువల్ ఎఫెక్ట్‌లను అందించేందుకు జాగ్రత్తలు తీసుకుంటోంది.
Also Read: Maha Kumbh Mela: మహా కుంభమేళాకు 50 కోట్ల మంది భక్తులు.. యూపీ సర్కార్ సంచలన ప్రకటన